కావలసిన పదార్థాలు :
బియ్యం :అర కేజీ
పాలకూర : రెండు కట్టలు
ఉల్లిపాయ . పెద్దది ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టీ.
పచ్చిమిర్చి ముద్ద : 6 కాయలది
టొమోటో : ఒకటి
జీలకర్ర, మిరియాల పొడి : ఒకటిన్నర టీ స్పూన్
ఉప్పు : తగినంత
నిమ్మరసం : రెండు టీ.
కరివేపాకు : రెండు రెబ్బలు
కొత్తిమీర : ఒక కట్ట
తయారీ విధానం :
ఉల్లిపాయని పొడవు ముక్కలుగా తరిగి పక్కనుంచాలి. పాలకూరను నీటిలో ఉడికించి పేస్టులాగా చేసుకోవాలి. దళసరి అడుగు ఉన్న కడాయిలో కరివేపాకు, మిగిలిన ఉల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముద్ద వేసి వేయించాలి. అందులోనే టమోటో ముక్కలు, జీలకర్ర మిరియాల పొడులతోపాటు బియ్యం, ఉప్పు కూడా వేసి మరికాసేపు వేయించాలి.
ఆపై ఒకటికి రెండున్నర కప్పుల చొప్పున నీటిని పోసి సన్నటి మంటపై ఉడికించాలి. అన్నం ఉడుకుతుండగా పాలకూర ముద్దను వేయాలి. దించేముందు నిమ్మరసం కలిపి.. ఆపై ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వేయించిన జీడిపప్పులతో అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: